రెండురోజుల నిరాహార దీక్షకు రాష్ట్రంమొత్తాన్ని కదిలించి సంచలనం సృష్టించిన యువనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ తర్వాత కూడా తన పోరు ఆపదల్చుకోలేదు. కొత్త పార్టీ స్థాపించిన తర్వాత రైతు ఎజెండానే ప్రధానంగా ఉంటుందని, తాను కూడా తండ్రి వైఎస్సార్ లాగే రైతు బాంధవుడ్నని ఆయన చాటుతున్నారు. తాజాగా జగన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అప్పాయింట్ మెంటు కోరారు. బహుశా 28,29 తేదీల్లో ఆయన డిల్లీ వెళ్ళి ప్రధానిని కలుస్తారు. అప్పటికి ఆయనకు అప్పాయింట్ మెంట్ కూడా వస్తుదని అంటున్నారు. మాజీ ఎంపీ హోదాలో జగన్ ప్రధానిని కలుస్తున్నారు. కాగా రైతు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని జగన్ ప్రధాని దృష్టికి తీసుకువెళతారని అంటున్నారు. కేంద్రం చొరవ చూపి బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరనున్నారు. కాగా రైతు సమస్యలపై తన వ్యవహార శైలితో ఇప్పటికే ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి జగన్ ఢిల్లీ యాత్ర, ప్రధానితో భేటీ తలనొప్పి తెస్తాయనడంలో సందేహం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. Monday, December 27, 2010
ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరిన యువనేత జగన్
రెండురోజుల నిరాహార దీక్షకు రాష్ట్రంమొత్తాన్ని కదిలించి సంచలనం సృష్టించిన యువనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ తర్వాత కూడా తన పోరు ఆపదల్చుకోలేదు. కొత్త పార్టీ స్థాపించిన తర్వాత రైతు ఎజెండానే ప్రధానంగా ఉంటుందని, తాను కూడా తండ్రి వైఎస్సార్ లాగే రైతు బాంధవుడ్నని ఆయన చాటుతున్నారు. తాజాగా జగన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అప్పాయింట్ మెంటు కోరారు. బహుశా 28,29 తేదీల్లో ఆయన డిల్లీ వెళ్ళి ప్రధానిని కలుస్తారు. అప్పటికి ఆయనకు అప్పాయింట్ మెంట్ కూడా వస్తుదని అంటున్నారు. మాజీ ఎంపీ హోదాలో జగన్ ప్రధానిని కలుస్తున్నారు. కాగా రైతు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని జగన్ ప్రధాని దృష్టికి తీసుకువెళతారని అంటున్నారు. కేంద్రం చొరవ చూపి బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరనున్నారు. కాగా రైతు సమస్యలపై తన వ్యవహార శైలితో ఇప్పటికే ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి జగన్ ఢిల్లీ యాత్ర, ప్రధానితో భేటీ తలనొప్పి తెస్తాయనడంలో సందేహం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ చాతుర్యం... కాంగ్రెస్ అధినేత్రికి ఇరకాటం
ఏకపక్షంగా నియంతృత్వ శైలిలో జగన్ విషయంలోవ్యవహరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇపుడు తల పట్టుకుంటున్నారు. తన వీర విధేయుల చెప్పుడు మాటలు పట్టుకుని నిజమైన ప్రజాదరణ ఉన్న నేతలను నిరాదరించడం ద్వారా పొరపాటు చేసిన విషయాన్ని కొందరు కాంగ్రెస్ పెద్దలు కూడా ఆమె దృష్టికి తెచ్చారని అంటున్నారు. వీరిలో ప్రణబ్ ముఖర్జీ ముఖ్యులు. జగన్ విషయంలో ఆంతరంగికులు కొందరు అమెను తప్పుదోవ పట్టించారని, అయితే సోనియా కూడా వారికే విలువ ఇచ్చి జగన్ విషయంలో ఎందుకో తొందర పడ్డారని పార్టీ ముఖ్యులతో అన్నారని సమాచారం. ఈ విషయం సోనియా కోటరీలో ఇపుడు చర్చనీయాంశమైంది. వైఎస్ వ్యతిరేక వర్గం పనిగట్టుకుని చేసిన దుష్ప్రచారానికి సోనియా ప్రభావితమయ్యారని, వైఎస్ కుటుంబం పార్టీకి చేసిన సేవల్ని హైకమాండ్ అసలు పట్టించుకోకపోవడం శోచనీయమని కొందరు పేర్కొంటున్నారు. పార్టీలో, కడప నియోజకవర్గంలో జగన్‌ను ఏకాకి చేసేందుకు హైకమాండ్ ఎత్తుగడ వేస్తే, ఇది సకాలంలో గ్రహించిన జగన్ అధిష్టానానికే దిమ్మదిరిగేలా తన రాజకీయ చాతుర్యం చూపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో, ఆత్మరక్షణలో పడింది. రాజకీయాలు అస్తవ్యస్తంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ పేరు తల్చుకుంటేనే అధిష్టానానికి వణుకు పుడుతోంది. గతంలో కాంగ్రెస్ పై తోక ఝాడించిన సీనియర్ కాంగ్రెస్ నేతలకు, ఇవాల్టి జగన్ కు ఏదో అంతరం స్పష్టంగా గోచరిస్తోంది. అతడిలో ఏదో పవర్ కాంగ్రెస్ అధిష్టానాన్ని కట్టి పడేస్తోంది. దిక్కుతోచక తలపట్టుకునేల చేస్తోంది. చివరికి బహిరంగ వ్యఖ్యలు చేసిన కొండా సురేఖ, పిల్లి సుభాశ్ చంద్రబోస్, సబ్బం హరి వంటి నేతల్ని కూడా ఏమీ చేయలేని క్రియాశూన్యత అధిష్టానాన్ని పీడిస్తోంది. సొంత పార్టీ స్థాపనకు జగన్ సన్నాహాలు ఇంకా పూర్తి కాకుండానే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు జగన్ వైపు అడుగులు వేస్తున్నారు. అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం కొట్టుమిట్టాడుతోంది. జగన్‌కు తన మద్దతు ఉంటుందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి బహిరంగంగా ప్రకటించారు.అధిష్టానం తనను వివరణ కోరిన అర్థ గంటలోనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. ఆయనతో కలసి రైతులను పరామర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీకి వ్యతిరేకంగా సొంత పార్టీ పెట్టబోతున్న వ్యక్తితో కలసి తిరుగుతున్నా నాయకత్వం ప్రేక్షకపాత్ర వహించాల్సివచ్చింది. ఇక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డి కూడా జగన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించినా ఏం చేయలేక పోయింది. పైగా వీరిద్దరితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా మాట్లాడి కూడా మనసు మార్చలేకపోయారు. కనీసం రాజీనామా చేయొద్దని మాత్రం సీఎం వీరిని వేడుకోవలసి వచ్చింది. తెలంగాణకు జై అంటే జగన్ కు తిరుగు ఉండదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి చెప్పడం మరో సంచలనం. పైగా జగన్ పార్టీ విధివిధానాలు నచ్చితే ఆ పార్టీలో చేరుతానని కూడా దామోదర్ రెడ్డి బాహాటంగానే ప్రకటించారు. ఎమ్మెల్యే కొండా సురేఖ రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజారక్షణ-భద్రత కమిటీ మాజీ ఛైర్మన్ కేవీపీ.రామచంద్రరావును బ్రోకర్‌గా సంబోధించారు. వైఎస్ హత్యలో ఆయనకు ప్రమేయం ఉందన్నారు. అయినా సరే అధిష్టానం మిన్నకుండి పోయిందేగానీ, కనీసం షోకాజ్ నోటీసు ఇచ్చే సాహసం కూడా చేయలేకపోయింది. జగన్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని సురేఖ అంటే కనీసం పీసీసీ ఆమెను మందలించిన దాఖలాలు కూడా కనిపించలేదు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించి ఎవరిపై చర్యలు తీసుకున్నా ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్న భయం నాయకత్వాన్ని వేధిస్తోంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం వారికి ప్రధానంగా మారిపోఇంది. జగన్‌వైపు ఎంపీలు వెళితే ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఇబ్బందిలో పడుతుందోనని కాంగ్రెస్ బెదిరిపోతోంది.
Tuesday, December 21, 2010
జనసంద్రంలో ప్రతిధ్వనించిన జగన్నినాదం
లక్షలాది మంది రైతన్నల పదఘట్టనలతో విజయవాడ దద్దరిల్లింది.. బెజవాడ జనవాడగా మారింది. క్రిష్ణమ్మ జనసంద్రమైంది. తాము ఓటేస్తే గెలిచి తమను పట్టించుకోని సర్కారు తీరుపై నిరసన నినాదం రణన్నినాదంలా కాదు జగన్నినాదంలా మార్మోగింది.. తమ తరఫున పోరాడుతున్న యువనేత జగన్‌మోహన్‌రెడ్డికి తోడుగా వచ్చిన అన్నదాతలు, చేనేత కార్మికులతో మంగళవారం బెజవాడ అణువణువూ నిండిపోయింది. లక్ష మందితో సామూహిక నిరాహార దీక్ష చేస్తానని యువనేత ప్రకటిస్తే... తొలిరోజే రెండు లక్షలకుపైగా జనం తరలివచ్చి ఆయనను విజయీభవ అని ఆశీర్వదించారు. కృష్ణా తీరాన ఏర్పాటు చేసిన వైఎస్సార్ దీక్షా ప్రాంగణం జనప్రవాహంతో పోటెత్తింది. లక్షలాది మంది జనం సమక్షంలో, కృష్ణమ్మ సాక్షిగా, సీతమ్మ పాదాల సన్నిధిలో వైఎస్ జగన్ మంగళవారం ఉదయం లక్ష్య దీక్ష పేరిట 48గంటల దీక్ష ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆశీస్సులు, దర్గాలో దీవెనలు అందుకున్న జగన్ మంగళవారం ఉదయం 11.00 గంటలకు నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం కడప, కర్నూలు జిల్లాల్లో అలుపెరగకుండా పర్యటించి, రాత్రంతా రైల్లో ప్రయాణించి వచ్చిన ఆయన కొద్దిసేపైనా విశ్రాంతి తీసుకోకుండానే నిరాహార దీక్ష మొదలు పెట్టారు. యువనేత వైఎస్సార్ ప్రాంగణానికి చేరుకునే సమయానికే ఇసుక తిన్నెల ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. వందలాది మంది నేతలు, అభిమానులు స్వాగతం పలుకుతుండగా జగన్ వేదికపైకి వచ్చి, వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షలో కూర్చున్నారు.
మాజీ మంత్రులు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్, పుల్లా పద్మావతి, వందలాది మంది నేతలు దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్సార్ ప్రాంగణానికి వచ్చి జగన్‌కు మద్దతునిచ్చారు. నందమూరి లక్ష్మీపార్వతి, రోజా, రాజశేఖర్-జీవిత దంపతులు, రాజా, విజయచందర్ తదితరులు దీక్షా శిబిరానికి వచ్చారు. వేదికపై నేతల ప్రసంగాలు సాయంత్రం వరకూ సాగాయి. సాయంత్రం 4.30 గంటలకు జగన్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నంత సేపూ అభిమానులు కృష్ణా తీరాన్ని హోరెత్తించారు. అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్ చేసిన ప్రసంగం పదునైన పదాలతో కదనోత్సాహం రగిల్చింది.
దీక్షలో పాల్గొనేందుకు, యువనేతకు మద్దతు తెలిపేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అభిమానులు, నాయకులు తండోపతండాలుగా కృష్ణాతీరానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకే వైఎస్సార్ ప్రాంగణం సగానికి పైగా నిండిపోయింది. సాయంత్రమయ్యేసరికి జనం చీమలబారుల్లా ఉవ్వెత్తున ఇసుక తిన్నెలకు చేరుకున్నారు. పాదయాత్రలు, ప్రదర్శనలుగా తరలివస్తున్న వారితో కృష్ణలంక హైవే, కెనాల్ రోడ్డు, కాళేశ్వరరావు మార్కెట్, కంట్రోల్‌రూమ్ తదితర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. యువనేతను చూసేందుకు పసి పిల్లలను చంకన వేసుకుని కొందరు కుటుంబ సమేతంగా ఆ ప్రాంతానికి రావడం విశేషం.
జగన్ చూసేందుకు అభిమానులంతా వేదిక వద్దకు దూసుకొచ్చేశారు. పోలీసులు వారిని ఆపలేక చేతులెత్తేశారు. దీంతో వేదిక చుట్టూ వేలాది మంది జనం చేరిపోయారు. జగన్ ను పలుకరించేందుకు, చేయి కలిపేందుకు వారు తహతహలాడారు. ఇక చేసేదిలేక చాలామందిని వేదికకు అనుబంధంగా వేసిన మార్గంలోకి అనుమతించి యువనేత వద్దకు పంపారు. మరోవైపు వెనుక మార్గం నుంచి అనేక మంది వేదిక పైకి ఎక్కేశారు. పలుమార్లు నేతలతోపాటు జగన్ వారిని వారించినా ఫలితం లేకపోవడంతో లాఠీచార్జి కూడా జరిగింది. ఈ గందరగోళంలో బ్యారికేడ్లు, లైట్లు ధ్వంసమయ్యాయి. మంగళవారం రాత్రి వరకూ వాహనాలు అసంఖ్యాకంగా నగరంలోకి వస్తూనే ఉండడంతో ఎక్కడికక్కడ దీపతోరణాల్లా, చీమల బారుల్లా వాహనాలు, జనమే గోచరించాయి. .
ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 23 మంది ఎమ్మెల్యేలు విజయవాడ వచ్చి జగన్‌కు మద్దతు పలికారు. వీరిలో కొందరు జగన్‌ను ప్రభుత్వ అతిథి గృహంలో కలిశారు. మరి కొందరు దీక్షలో పాల్గొన్నారు. వీరితోపాటు ఇతర జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు. మరికొందరు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులూ ఫోన్లో యువనేతను పలకరించి దీక్ష సక్సెస్ కావాలని అభిలషించడం విశేషం.
రైతులకోసం జగన్ ఇచ్చిన 48 గంటల దీక్ష పిలుపుకు రాష్టవ్య్రాప్తంగా లభించిన స్పందన పార్టీలకూ.. ప్రాంతాలకూ అతీతంగా ఉంది. ప్రస్తుతానికి ఏపార్టీకీ చెందని జగన్ ఇచ్చిన పిలుపునకు స్పందనగా కాంగ్రెస్, పీఆర్‌పీ, తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు సంఘీభావం ప్రకటించారు. మరో పదిరోజుల్లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే సమయంలో కూడా ప్రాంతాలకు అతీతంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాలనుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ జగన్ ను ఒంటరిని చేసి పంపాలనుకుంది. అయితే ఇప్పుడు జగన్ ఒంటరి కాదు.. లక్షలాది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జననేతగా ఆయన కృష్ణా నదీతీరంలో సీతమ్మ పాదాల సాక్షిగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. ముఖ్యంగా భారీ వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్న ప్రాంతాల రైతులు, కౌలు రైతులు, చేనేత కార్మికులు దీక్షకు అధిక సంఖ్యలో వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్యాకేజీలో కౌలు రైతుల ప్రస్తావన లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన రైతులు, వరి సాగుతో కుదేలైన ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ఈ దీక్షకు హాజరయ్యారు. వీరితోపాటు చేనేత కార్మికుల సమస్యలపై జగన్ సమరభేరి మోగించడంతో ఆ వర్గం కార్మికులు, రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.

Tuesday, December 14, 2010
జగన్ వెంటే ఉంటానన్న శేషారెడ్డి
జగన్ వెంట నడిచే ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకీ విస్తరిస్తోంది. ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యేలను సముదాయించడం, బుజ్జగించడం తంటాగా మారింది. బందరు ఎమ్మెల్యే పేర్ని నానీని ముఖ్యమంత్రి బతిమాలినా ఫలితం లేకపోయింది. ఆయన్ను ఏదో చేసి ఏదో విధంగా తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాల్ని సీఎం చేస్తుండగానే తూర్పుగోదావరి జిల్లానుంచి నల్లమిల్లి శేషారెడ్డి రూపంలో మరో బాంబు పేలింది.
తన నియోజక వర్గ కార్యకర్తల అభీష్టం మేరకు తాను వైఎస్ జగన్ యాత్రలో పాల్గొనబోతున్నట్టు శేషారెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆయనతో మాట్లాడినా శేషారెడ్డి తన వైఖరి మార్చుకోలేదు. తన కార్యకర్తలందరూ జగన్ కే మద్దతు ఇస్తుండగా తనకు వెళ్లకుండా ఉండటం ఎలా సాధ్యమని శేషారెడ్డి సీఎం ను ప్రశ్నించారని సమాచారం. ఇదిలావుంటే ఇంకా తూర్పు గోదావరి జిల్లాలో జగన్ కు బాసటగా నిల్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆది నుంచి జగన్ కుడిభుజంలా ఉంటూ మంత్రి పదవిని సైతం త్యజించడానికి సిద్ధపడిన మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్యనాయకులతో కీలక మంతనాలు సాగిస్తున్నట్లు భోగట్టా. మరోవైపు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబాలు ముద్రగడ, జక్కంపూడి సైతం జగన్ వెంటే ఉన్నాయి. తూర్పుగోదావరి యాత్రతో జగన్ ప్రజాబలం, ఆయనకున్న రాజకీయ మద్దతు ప్రస్ఫుటం అవుతుందని అంటున్నారు.
ఈ యాత్రలో తన జన బలాన్ని ప్రదర్శించి అధిష్టానం గుండెల్లో రైళ్లు పరుగెట్టించాలని జగన్ వర్గం కదన కుతూహలంతో ఉంది. జగన్ ఎక్కడ యాత్ర చేపట్టినా జనం తండోపతండాలుగా స్వచ్చందంగానే వస్తున్నారని జిల్లా రాజకీయ నేతలు చెబుతున్నారు.

Thursday, November 11, 2010
కాంగ్రెస్ లో కుట్రపూరిత వాతావరణం
అంబటి ధ్వజం
చెవిరెడ్డి భాస్కరరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని మరో బహిష్కృత నేత, జగన్ వర్గంలోని ప్రముఖ నాయకుడు అంబటి రాంబాబు తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన భాస్కరరెడ్డిపై ఈచర్య అత్యంత శోచనీయమని గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ అంబటి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కుట్రపూరిత వాతావరణం నెలకొనివుందని ఆయన ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అనుకూలంగా మాట్లాడిన వారిని, ఓదార్పుకు అనుకూలంగా కదులుతున్న నేతలను బయటకు గెంటేస్తున్నారన అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌కు అండగా నిలబడుతున్న నాయకులపై చర్యలు తీసుకుంటున్న అధినాయకత్వం, మరి పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిని ఎందుకు ఉపేక్షిస్తోందని ఆయన ప్రశ్నించారు. పార్టీని అభాసుపాలు చేస్తున్నవారిని, భ్రష్టు పట్టిస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారని అధినాయకత్వం ఏకపక్ష పోకడలపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
జగన్ ఓదార్పుకు మద్దతివ్వడమే పాపమా?
తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి సస్పెన్షన్
కాంగ్రెస్ యువనేత, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు మద్దతిచ్చినందుకు గాను ఆయన వర్గానికి చెందిన తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ (తుడా) మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వెలివేసింది. చెవిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుధవారం ప్రకటించింది. పీసీసీ క్రమశిక్షణా సంఘం ఈ చర్య తీసుకుంది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నిస్తూ గతంలోనే చెవిరెడ్డికి నోటీస్ జారీ చేసిన విషయం తెల్సిందే. ఆ నోటీస్‌కు చెవిరెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే దీనికి సంతృప్తి చెందని పార్టీ పెద్దలు ఈ తీవ్రమైన చర్య తీసుకున్నారు. జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, కొండా సురేఖ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులకు ఇప్పటికే పార్టీ నుంచి ప్రతికూలత ఉంది. కొందర్ని దూరం పెడుతూ మరికొందర్ని సస్పెండ్ చేస్తూ అధిష్టానం మొత్తానికి జగన్ వర్గాన్ని ఒకేలా చూస్తున్న విషయం విదితమే.
నోకాజ్ నోటీస్ ఇచ్చారు: చెవిరెడ్డి
సస్పెన్షన్‌పై తనకెలాంటి బాధా లేదని చెప్పిన చెవిరెడ్డి ప్రజాదరణ లేని, ఎన్నికల్లో గెలవలేని వ్యక్తుల చేతుల్లో పార్టీ బందీగా మారుతోందని ఆవేదన చెందారు. తన సస్పెన్షన్‌కు సిఫార్సు చేసిన వారికి ప్రజల్లో పరపతే లేదన్నారు. తనకు నో కాజ్ నోటీస్ ఇచ్చారని దుయ్యబట్టారు.

Monday, November 8, 2010
జగన్ ఓదార్పుపై ప్రశంసల వర్షం
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహం కడుపున పుట్టిన మరో సింహం అని తెలుగు దేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన కోహినూర్ వజ్రం జగన్ అని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి జగనే నిజమైన హీరో అని కూడా పొగిడారు. తండ్రి మరణానికి చలించి శ్వాస విడిచిన వారిని ఓదార్పు పేరుతో స్వయంగా వచ్చి కలుసుకోవడం ఆయన మంచితనానికి ప్రబల నిదర్శనమన్నారు. చివరి శ్వాస వరకు తాను జగన్ తోనే ఉంటానని నల్లపురెడ్డి ప్రతిన బూనారు.కమ్యూనిస్టు, భారతీయ జనతా పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే 2009లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి అన్నారు. రాష్ట్రంలో, కాంగ్రెస్ లో వైఎస్ లేని కొరత ఇవాళ స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. వైఎస్ వారసుడిగా జగన్ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకు వెళతాడని పలువురు శ్లాఘించారు. నెల్లూరులో జగన్ వర్గం బలప్రదర్శనకు సిద్ధపడినట్లు అర్థమవుతోంది. ఈ సభకు పెద్ద యెత్తున ప్రజలు హాజరయ్యారు. జగన్ వర్గానికి చెందిన నాయకులంతా అక్కడ మోహరించారు. కొత్తగా లక్ష్మీపార్వతి, రోజా వచ్చి చేరారు. జగన్ తప్ప మరో నాయకుడు లేడంటూ రోజాతో సహా మిగతా నాయకులంతా ఎలుగెత్తి చాటారు.
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అభిమన్యుడు కాడని, పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడని ప్రముఖ సినీ నటి రోజా అభివర్ణించారు. జగన్ పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడనీ పద్మవ్యూహంలోంచి బయటకు రాలేడని కొంత మంది అనుకుంటున్నారని, కానీ జగన్ దాన్ని ఛేదించే అర్జునుడని ఆమె అన్నారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆదివారం జరిగిన ఓదార్పు ముగింపు సభలో ఆమె ప్రసంగించారు. పాదయాత్ర తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదిగినట్లు ఓదార్పు తర్వాత జగన్ తిరుగులేని నాయకుడిగా, ప్రజల మనిషిగా ఎదుగుతారని ఆమె అన్నారు. జగన్ ను చూసి ఓర్వలేక కొంత మంది విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. తండ్రి ఆస్తులకు వారసులుంటారు గానీ ఆశయాలకు వారసులుండరని, తండ్రి ఆశయాల సాధనను జగన్ వారసత్వంగా స్వీకరించడమే జగన్ విశిష్టతకు నిదర్శనమని ఆమె అన్నారు. వైయస్ ఆశయాల సాధనకు ముందుకు వచ్చిన వైయస్ జగన్ కు ప్రజలంతా సహకరించాలని ఆమె అన్నారు. మీ కుటుంబంలో తానొకడిని అని చెప్పడానికే జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారని ఆమె చెప్పారు. ఈ యాత్ర చరిత్రలో నిల్చిపోతుందని, ఇది రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి మంచిదని చెప్పారు.
సింహగిరి సీమ నుంచి జగన్ సింహనాదం
నెల్లూరులో ఆదివారం ఓదార్పు యాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సభ కోసం కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సర్వశక్తులూ సమీకరించారని తెలుస్తోంది. రెండు మాసాలకు పైగా దాదాపు 63 రోజుల పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఓదార్పు యాత్ర నిర్వహించిన జగన్ ఆ సమయంలో అధిష్టానంపై గానీ పార్టీలోని ప్రత్యర్ధి నాయకులపై గానీ విమర్శలేమీ చేయలేదు. ఆయన ప్రసంగాలు రొటీన్ గానే సాగుతున్నట్లు అనిపించింది. దీంతో మీడియా కూడా కొంత ఉదాసీనంగా వ్యవహరించింది. అయితే తన వర్గంపై అధిష్టానం, కొందరు వైఎస్ వ్యతిరేక పక్ష నేతలు చేస్తున్న రాజకీయ దాడి నేపధ్యంలో జగన్ నెల్లూరు సీమ నుంచి పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. పార్టీ అధిష్టానానికి హెచ్చరిక చేస్తూ తన అంతరంగాన్ని స్పష్టం చేశారు. వైయస్ జగన్ ఈ సభలో మామూలుగా కాక కాస్త కటువుగా మాట్లాడారు. ప్రతిపక్షాలను, వ్యతిరేక మీడియాను వదిలేసి సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. తనను ఒంటరి చేయడానికి పార్టీలో కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. పార్టీ అధిష్టానం తనను అంగీకరించే స్థితిలో లేదని తెలిసిన యువనేత తనను కాదంటే ఎదురయ్యే పరిస్థితి ఏమిటో పరోక్షంగా అధిష్టానానికి చెప్పదలిచారని, అందుకే అలా మాట్లాడారని భావిస్తున్నారు. అధిష్టానాన్ని ధిక్కరించి ఓదార్పు యాత్ర చేపట్టిన వైయస్ జగన్ ప్రతి అంశంలోనూ ఆయన చాలా స్పష్టంగా ఉన్నారని అంటున్నారు.
Wednesday, August 18, 2010
జగన్ ను దూరంచేసుకుంటే... రోశయ్య సర్కారుకు ప్రమాద ఘంటికలే!!

జగన్ విషయంలో అధిష్టానం వైఖరి శ్రుతి మించితే అది రాష్ట్రంలో రోశయ్య ప్రభుత్వానికి ముప్పుగా పరిణమిస్తుందని రాజకీయ పరిశీలకులు, నిఘావర్గాలు కూడా భావిస్తున్నాయి. సెప్టెంబరు 3వ తేదీన వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర ప్రారంభించదలిచారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఈ అంశం ఇప్పటికే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో అధిష్టానం పెద్దమనిషిలా కాకుండా దుందుడుకుగా వ్యవహరిస్తున్న తీరుతో కాంగ్రెస్ పార్టీలో చీలిక అనివార్యం కావచ్చని భయపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం జగన్ ఓదార్పు యాత్రను దెబ్బకొట్టేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవడం ఈసారి విశేషం. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ప్రత్యక్షంగా అధిష్టానం దూతలు నేరుగా సంభాషిస్తూ వారిని జగన్ కు దూరం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నటు భోగట్టా. ఓదార్పు యాత్ర విషయంలో మినహా మిగిలిన అన్ని విషయాల్లోనూ జగన్ అధిష్టానానికి విధేయుడే. అయినా సరే పరిగణనలోకి తీసుకోకుండా ఇలా వ్యతిరేక ధోరణితో పార్టీ పెద్దలు వ్యవహరించడాన్ని జగన్ వర్గం స్వతహాగానే జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపధ్యంలో వైఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా అమీతుమీకే సిద్ధమయ్యారు. ఎవరెన్ని చెప్పినా ఓదార్పు యాత్ర ఆగదని ఆయన ఈసరికే తేల్చి చెప్పారు. అధిష్టానం రెచగొడుతున్నట్టే ఆయన తన భవిష్యత్ కార్యచరణపై అనుకూల వర్గంతో, అభిమానులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఓదార్పు యాత్రను మాత్రం యధావిధిగా కొనసాగించాలనే కృతనిశ్చయంతో జగన్ ఉన్నారు. అయితే పార్టీ జగన్ పై క్రమశిక్షణ చర్య వంటి దుస్సాహసానికి పాల్పడితే మాత్రం జగన్ సొంతపార్టీ పెట్టడం లేదా రాష్ట్ర కాంగ్రెస్ ను చీల్చడం అనివార్యం అవుతాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను ఓదార్పులో పాల్గొనాల్సిందిగా జగన్ కోరినప్పుడు అధిష్టానం తమను దూరంగా ఉండాలని ఆదేశించిన విషయాన్ని వారు చెప్పినట్టు సమాచారం. జగన్ ఈ యాత్రను తన వ్యక్తిగత యాత్ర అని ప్రకటించిన నేపథ్యంలోనే సోనియా గాంధీ ఓదార్పులో పార్టీ ప్రతినిధులను పాల్గొనవద్దని ఆదేశించారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే అధిష్టానం మాటను కూడా కాదని ప్రకాశం, నెల్లూరు జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు జగన్ యాత్రకు మద్దతు పలుకుతామని బహిరంగంగా ముందుకు రావడం రాష్ట్ర సర్కారుకు ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. సెప్టెంబరు 2వ తేదీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రథమ వర్థంతి రోజున జగన్ కచ్చితంగా ఏదో చేయబోతున్నారని కాంగ్రెస్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారంలో ఉంది.
ముఖ్య అనుచరులతో జగన్ కీలక భేటీ
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ శ్రావణ మాసంలో తొలి శుక్రవారం నాడు తన నివాసంలో ఓ కీలక భేటీ జరిపారు. తన ముఖ్య అనుచరులతో ఆయన తన భవిష్యత్తు వ్యూహంపై ఇవాళ చర్చించారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే శుక్రవారం తన అనుచరులతో కూర్చున్న జగన్ భవిష్యత్తు పై స్పష్టమైన విజన్ తో చర్చలు జరిపారంటున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన వైయస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా జరిపే సంస్మరణ సభ తాలూకు పోస్టర్ ను ఆయన ఈ సందర్భంగా విడుదల చేశారు. పార్టీతో ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయన దాన్ని సొంత కార్యక్రమంగానే తీసుకుంటున్నారు. ఈ సంస్మరణ సభలోనే ఆయన సొంత పార్టీ పెడతారని జోరుగా
ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. కాగా శుక్రవారం జగన్ ను కలిసినవారిలో ఎపిఐఐసి మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, శాసనసభ్యురాలు కొండా సురేఖ, టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు. వచ్చే నెల 3వ తేదీన జగన్ ఓదార్పు యాత్ర ప్రకాశం జిల్లాలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో యాత్ర జరుగుతుందని భావిస్తున్నారు.

యాత్రకి సిద్ధమన్న బాలినేని, సబ్బం
ప్రకాశం జిల్లాలో వచ్చే నెల మూడో తేదీ నుంచి కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న ఓదార్పు యాత్రలో తాము పాల్గొని తీరుతామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తనతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఈ యాత్రలో పాల్గొంటారని ఆయన తేల్చి చెప్పారు. ఓదార్పు యాత్రలో పార్టీ శ్రేణులను పాల్గొనవద్దంటూ అధిష్టానం ఆదేశించిందని మీడియాలో వార్తలు గుప్పుమన్న తర్వాతే మంత్రి బాలినేని ఈ ప్రకటన చేయడం విశేషం. అలాగే విశాఖ ఎంపీ సబ్బం హరి కూడా ఓదార్పు యాత్రలో పాల్గొంటానని తేల్చి చెప్పారు. ఓదార్పుయాత్రలో పాల్గొనవద్దని అధిష్టానం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వారన్నారు. యాత్రలో ప్పాల్గొనరాదనేది అధిష్టానం అభిమతమైతే ఆమేరకు వ్యక్తిగతంగా తనకీ అధిష్టానం సమాచారమివ్వాలని సబ్బం హరి అన్నారు. ఇదిలావుండగా, వైఎస్.జగన్ చేపడుతున్న ఓదార్పు యాత్రలో ప్రజాప్రతినిధులెవ్వరూ పాల్గొన వద్దని, అది ఆయన వ్యక్తిగతమని కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ శ్రేణులకు సూచించింది. జగన్ తీరుపై సోనియా ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీలోని ఓ వర్గం విస్తారంగా ప్రచారం చేస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం జగన్ శిబిరంలో ఒకింత నైరాశ్యాన్ని నింపింది. Thursday, July 29, 2010
సరళమైన పదాలతో పదునైన వ్యాఖ్యలు
తూర్పు ఓదార్పు యాత్రకు భారీ బల ప్రదర్శనతో స్వస్తి
మొత్తమ్మీద తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు యాత్ర ముగిసింది. అనుకున్న దానికంటే పది పన్నెండు రోజులు షెడ్యూల్ పెరగ్గా ఏకంగా 19 రోజులపాటు సాగిన జగన్ ఓదార్పు యాత్ర కాకినాడ నేతాజీ పార్క్ వద్ద భారీ జనసంద్రం మధ్య జరిగిన బహిరంగ సభతో ముగిసింది. ఈ సభలో సభికుల జయజయధ్వానాల మధ్య వైఎస్ జగన్ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ఆయన ప్రసంగంలో తనను అభిమానించే జనంపై అవ్యాజమైన అభిమానం తొణికిసలాడింది. చాలా సరళమైన పదాలే అయినా... పేలోడ్ మోసుకెళ్ళే క్షిపణుల్లా ఆయన హెచరికలు పేలాయి. ఆచితూచి చేసిన ఆయన ప్రసంగం సింపుల్ అయినా సుపర్బ్ గా నిల్చింది. తన పట్ల ఎంతో ప్రేమను చూపిన అంబటి రాంబాబు, కొండా సురేఖలకు అన్యాయం జరిగిందని జగన్ అన్నారు. ఇది చూసి తన గుండె బరువెక్కి పోయిందన్నారు. తనకు ఎంత కాలం ఈ సహనం ఉంటుందో, ఎన్ని రోజులు ఇలా ఉండగలనో తెలియదని వ్యాఖ్యానించడం ద్వారా తన మదిలో భావాన్ని చాలా స్పష్టంగా ఆయన చెప్పేశారు. తద్వారా కాంగ్రెస్ అధిష్ఠానం ధోరణిపై సవాల్ విసిరారు.
2004 వరకూ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించి అధికారంలో నిలబెట్టడమే కాక ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నింపాలని తన తండ్రి వైఎస్సార్ అహరహం తపించారని ఆయన స్మరించుకున్నారు. రాష్ట్రంలో 26 లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను చదువుతున్నారంటే దానికి కారణమెవరని ఆయన ప్రశ్నించారు. అందరూ బదులుగ వైఎస్ ఆర్ అని అరిచారు. సంక్షేమ పథకాలు పేదవాడికి అందుతున్నాయంటే దానికి కారణమెవరు..? ప్రాజెక్టులు కట్టించి... జలయజ్ఞం చేసి కోటి ఎకరాలు సాగు చేసిన ఘనత ఎవరిదని ఆయన అడిగారు. ఇంత సేవ చేసిన మహానేత కన్నుమూస్తే, ఆయన చనిపోయినందుకు కొన్ని గుండెలు ఆగిపోతే.. వారిని పరామర్శించడం తప్పా...? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. దీనిలో రాజకీయ కుట్ర దాగి ఉందా...?" అంటూ ఆవేదన చెందారు.
తన ఓదార్పు యాత్ర వెనుక తనలో ఎటువంటి కుళ్లూ కుతంత్రం లేదనీ, కానీ కొంతమంది తను చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు యత్నించారన్నారు. ఈ పరిస్థితిల్లో ఒకటే అనుకున్నాను. ఎంతకాలం బతికాం అన్నది కాదు.. ఎలా బతికాం, ఎవరికోసం బతికాం అన్నది ముఖ్యం... అందుకే అన్నీ వదులుకుని నాన్నకు ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం మీకోసం కదిలి వచ్చానని జగన్ అన్నారు. జగన్ యాత్ర తూర్పున ముగిసిన సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి మొత్తం సుమారు 30మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు హాజరైనట్లు చెబుతున్నారు. జగన్ కు అంత సీన్ లేదని గత కొన్నిరోజులుగా విపరీత వ్యాఖ్యలు చేసిన పలువురు కాంగ్రెస్ పెద్దలకు ఈ సభతో కళ్ళు చెదిరి ఉంటాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Saturday, July 24, 2010
అతడిది ఓదార్పు మాట... వారిది బ్లాక్ మెయిలింగ్ బాట
జగన్ పై కాంగ్రెస్ ఆర్ధిక దాడి
తాము వద్దన్నా ఓదార్పు యాత్ర చేస్తున్న తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు షాక్ ఇవ్వాలనే కాంగ్రెసు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన బయ్యారం గనుల లీజును ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో ఇనుప ఖనిజం లీజును నిలుపుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రోశయ్య స్వయంగా ఈ గనుల ఫైళ్ళను పరిశీలిస్తూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టారు ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో కూడా బయ్యారం గనుల అక్రమాలపై విచారణ జరిపిద్దామని ముఖ్యమంత్రి మంత్రులందరూ కాదంటున్నా సరే గట్టిగా ప్రతిపాదించడం ఆయన ధోరణికి నిదర్శనం. అయితే వైఎస్ హయాంలో జరిగిన ప్రతీ కార్యకలాపానికీ ఈ మంత్రులతో పాటు రోశయ్య కూడా బాధ్యుడే అనేది నైతికమైన విషయం. వైఎస్ సంక్షేమ కార్యక్రమాలలో తమకూ, తమ పార్టీకి, తమ మంత్రివర్గానికీ పాత్రను వెదుక్కునే ప్రబుద్ధులు తమకేమీ తెలియనట్టు, నాటి పరిణామాల్లో అవినీతి జరిగిందంటూ ఇపుడు చర్యలకు దిగడం వారి లేకి బుద్ధికి దురుద్దేశాలకూ ప్రత్యక్ష నిదర్శనం. నిజంగా వైఎస్ హయాంలో ఏదైనా అక్రమాలు జరిగిఉంటే రోశయ్య నుంచి సోనియా వరకూ అందరూ అందులో భాగస్తులే కావాలి..... అయితే వైఎస్ ఎంతో తపనతో అమలుపర్చిన సంక్షేమ పధకాలకు మాత్రం ఆయన ఒక్కడే కర్త, కర్మ, క్రియ అనేది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే ఇవాల్టి ప్రభుత్వం వైఎస్ పధకాల్ని భారంగానే భావిస్తోంది, వదిలించుకోవాలని ప్రయత్నిస్తోంది గనుక.
వైయస్ జగన్ ను కాంగ్రెస్ అధిష్టానం బ్లాక్ మెయిల్ చేస్తోందా.... అవుననే అనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోని నిర్ణయాలను కాంగ్రెసు అధిష్టానం తిరగదోడుతోంది. వివాదాస్పద నిర్ణయాలను, తన వారికి కోట్లాది రూపాయల ఆదాయాలు సమకూర్చే వనరులను కట్టబెట్టారనే ఆరోపణలున్న అంశాలను తిరగదోడుతూ ప్రభుత్వపరంగా జగన్ కు ఆయన కుటుంబ సభ్యులకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా గనుల లీజు వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. గనుల లీజు వ్యవహారాలు జగన్ వర్గానికి సంపదను సమకూర్చిపెడుతున్నట్లు కొందరు సీనియర్లు అధిష్టానాన్ని నమ్మించారు. దీంతో ఈ దిశగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. తన బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి గనుల శాఖ మంత్రిగా నియమించడం గనులను కొల్లగొట్టే వ్యూహంలో భాగమేనని దుష్ప్రచారం కొందరు చేపట్టారు. వైయస్ నిర్ణయాలను తిరగదోడడం ద్వారా జగన్ ఆర్థిక బలాన్ని నిర్వీర్యం చేయడం, నైతికంగా దెబ్బ తీయడం కాంగ్రెసు అధిష్టానం దూ(దు)రాలోచనగా తెలుస్తోంది. రోశయ్య ముఖ్యమంత్రి కాగానే దీనికి నాంది పలికారు. కర్నాటక మంత్రి, వైయస్ సన్నిహితుడు అయిన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల వ్యవహారంపై కూడా అధిష్ఠానం కన్నేసింది. జనార్దనరెడ్డి గనుల తవ్వకాల్లో వైఎస్ వర్గానికి వాటాలున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దాంతో ఓబుళాపురానికి కాంగ్రెస్ అధిష్టానం ఆసరాతో ప్రభుత్వం చెక్ పెట్టింది. చీమకుర్తి గ్రానైట్ వ్యవహారంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోందని సమాచారం. మరోపక్క ఏకపక్షంగా కొందరు అధికారుల్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టింది,
తాము వద్దన్నా ఓదార్పు యాత్ర చేస్తున్న తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు షాక్ ఇవ్వాలనే కాంగ్రెసు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన బయ్యారం గనుల లీజును ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో ఇనుప ఖనిజం లీజును నిలుపుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రోశయ్య స్వయంగా ఈ గనుల ఫైళ్ళను పరిశీలిస్తూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టారు ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో కూడా బయ్యారం గనుల అక్రమాలపై విచారణ జరిపిద్దామని ముఖ్యమంత్రి మంత్రులందరూ కాదంటున్నా సరే గట్టిగా ప్రతిపాదించడం ఆయన ధోరణికి నిదర్శనం. అయితే వైఎస్ హయాంలో జరిగిన ప్రతీ కార్యకలాపానికీ ఈ మంత్రులతో పాటు రోశయ్య కూడా బాధ్యుడే అనేది నైతికమైన విషయం. వైఎస్ సంక్షేమ కార్యక్రమాలలో తమకూ, తమ పార్టీకి, తమ మంత్రివర్గానికీ పాత్రను వెదుక్కునే ప్రబుద్ధులు తమకేమీ తెలియనట్టు, నాటి పరిణామాల్లో అవినీతి జరిగిందంటూ ఇపుడు చర్యలకు దిగడం వారి లేకి బుద్ధికి దురుద్దేశాలకూ ప్రత్యక్ష నిదర్శనం. నిజంగా వైఎస్ హయాంలో ఏదైనా అక్రమాలు జరిగిఉంటే రోశయ్య నుంచి సోనియా వరకూ అందరూ అందులో భాగస్తులే కావాలి..... అయితే వైఎస్ ఎంతో తపనతో అమలుపర్చిన సంక్షేమ పధకాలకు మాత్రం ఆయన ఒక్కడే కర్త, కర్మ, క్రియ అనేది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే ఇవాల్టి ప్రభుత్వం వైఎస్ పధకాల్ని భారంగానే భావిస్తోంది, వదిలించుకోవాలని ప్రయత్నిస్తోంది గనుక. అంబటి సస్పెన్షన్ బాధాకరం
పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు సస్పెన్షన్ చాలా చాలా బాధాకరమని యువనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ పరిణామం తనకెంతో కలత కలిగించిందని జగన్ అన్నారు. రాజమండ్రిలోని హుకుంపేటలో ఆదివారం ఉదయం ఏడోరోజు ఓదార్పు యాత్రకు బయలుదేరేముందు ఆయన మీడియాతో మాట్లాడారు. అంబటి గొప్ప నాయకుడని, పార్టీకి ఎంతో సేవ చేశారని చెప్పారు. నాన్న రాజశేఖరరెడ్డితో పాటుగా దాదాపు 1500కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అంబటి రాంబాబు పార్టీ రెండుసార్లు గెలవడం వెనుక కీలక పాత్ర పోషించారని తెలిపారు. అంబటి సస్పెన్షన్ పై అధిష్టానంతో మీరు మాట్లాడతారా అని విలేఖరులు ప్రశ్నించగా, తప్పకుండా తనవంతు పాత్ర పోషిస్తానని, తన ప్రయత్నం తాను చేస్తానని చెప్పారు. మీ వెనుక తిరిగేవారికి ఇది ఎటువంటి సిగ్నల్ ఇస్తుందని మీడియా ప్రశ్నిస్తే జగన్ ఆవేదన, ఆత్మవిశ్వాసాలతో స్పందించారు. తన వెనుక ఉన్నవారికి దేవుడున్నాడని, నాన్న ఆశీస్సులున్నాయని, వైఎస్ ను అభిమానించేవారి గుండెచప్పుడు తోడుందని పేర్కొన్నారు. అంబటిపై సస్పెన్షన్ చర్యను మీకు వార్నింగ్ గా భావించవచ్చా... అంటే, వార్నింగ్ తప్పు చేసేవారికి ఇస్తారు, నేనేమి తప్పు చేశానని ప్రశ్నించారు.
అంబటి సస్పెన్షన్ .... జగన్ కు పరోక్ష హెచ్చరికా?
ముఖ్యమంత్రి రోశయ్యపై విమర్శలు చేయడంతో పాటు సవాళ్లు విసిరి బహిరంగంగా పత్రికలకు ఎక్కిన అంబటి రాంబాబును కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి వీరప్పమొయిలీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కడప ఎంపీ జగన్ మోహన్‌రెడ్డి వీరవిధేయుడైన అంబటిపై వేటు వేయడం తాజా పరిస్థితుల్లోవ్యూహాత్మకమేనని సమాచారం. అధిష్టానం మాట కాదని యాత్ర చేస్తున్న జగన్ కు పరోక్ష హెచ్చరిక జారీచేయడమే ఈ చర్య ఆంతర్యంగా తెలుస్తోంది.జగన్‌పై చర్యలు ఉండవని హైదరాబాద్ లో మొయిలీ ప్రకటించిన కొద్దిసేపటికే సోనియా ప్రతినిధిగా అహ్మద్ పటేల్ ఆయనతో మాట్లాడి మేడమ్ అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అనంతరం గంటల వ్యవధిలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్‌పై క్రమశిక్షణ చర్యల విషయంలో అధిష్టానంపై కొందరు సీనియర్లు తీవ్ర ఒత్తిడి తెస్తున్న తరుణంలో మొయిలీ వ్యాఖ్యలు జగన్ వ్యతిరేకులకు బాగా కలిసివచ్చాయి.
ఓదార్పుపై మొయిలీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలతో.. యాత్రలో పాల్గొనే నేతల సంఖ్య పెరిగింది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు జగన్ యాత్రలో శనివారం పాల్గొన్నారు. దీంతో సీనియర్లు కంగు తిని ఈ వివరాల్ని తక్షణం ఢిల్లీకి మోసేశారు. ఈ వ్యవహారాలపై అర్జెంటుగా చర్చించేందుకు హస్తిన రావాలంటూ అధిష్టానం రోశయ్యకు కబురు పంపింది. జగన్ వర్గీయుల జాబితా, వారి నేపథ్యాల వివరాలను కూడా పట్టుకురావాలని మేడమ్ ఆదేశించారని వినిపిస్తోంది. ఇదిలాఉండగా తనకింగా సస్పెన్షన్ ఉత్తర్వులు అందలేదని అంబటి చెప్పారు. షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు రెండువారాల గడువివ్వాలని అంబటి కోరడం, దానికి పీసీసీ ఆమోదించడం తెలిసిందే. ఈ గడువు ముగియకుండానే అధిష్టానం ఇలా ఆయన్ను సస్పెండ్ చేయడం చూస్తే ఈ మధ్యలో జరిగిన పరిణామాలే కారణమని అర్ధం అవుతుంది.
Saturday, July 17, 2010
ఓదార్పుకి తూర్పులో వచ్చింది ఊపు
మొయిలీ ప్రకటనతో జగన్ వర్గంలో ఆనందోత్సాహాలు
నాడు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ రాజశేఖరరెడ్డి అస్వస్థతకు గురైంది తూర్పుగోదావరి జిల్లాలోనే. పదిరోజులకు పైగా ఆయన రాజమండ్రిలోని ఓ తోటలో విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత యాత్ర కొనసాగించారు. ఇక అప్పటినుంచి ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా సింపతీ వెల్లువెత్తింది. ఇక ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
ఇపుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా సెంటిమెంట్ గా తూర్పులో ఓదార్పుయాత్ర కలిసొచ్చింది. ఓదార్పు యాత్ర అధిష్టానానికి వ్యతిరేకమని కొందరు, దీనిపై జగన్ కు షోకాజ్ నోటీసులిచ్చారని ఇంకొందరు ప్రచారం చేస్తూ జగన్ పార్టీని వదిలేస్తారని నానా కంగాళీ సృష్టించారు. ఈ గందరగోళం మధ్య ఆయన యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది. మొదటి అంకంలో కొందరు ఎమ్మెల్యేలు కూడా యాత్రకు మొహం చాటేశారు. యాత్రలో పాల్గొన్న ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ని అధిష్టానం చివాట్లు పెట్టిందని కూడా ప్రచారం లేవదీశారు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్ధంకాని వాతావరణాన్ని సృష్టించి పారేశారు. అయితే తూర్పున నాలుగోరోజు యాత్ర నాటికల్లా ఈ అనుమాన మేఘాలు వీడిపోయాయి. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ప్రకటనతో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గంలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. వైయస్ జగన్ పై ఏ విధమైన చర్యలుండవని మొయిలీ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. జగన్ పై పార్టీ అధిష్టానం కొరడా ఝళిపిస్తుందనే ఊహాగానాలకు మొయిలీ ప్రకటనతో తెరపడింది. జగన్ ఓదార్పు యాత్ర శుక్రవారం రాత్రి రాజమండ్రి చేరేటప్పటికే ఈ ప్రకటన రావడం, ఎమెల్యేలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొనడం జరిగిఫోయాయి. మొయిలీ ప్రకటనతో పలువురు ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం జగన్ ను కలుసుకున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో కేంద్రమంత్రి పళ్ళంరాజు, ఎంపీ ఉండవల్లి, రాష్ట్రమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొనడంతో యాత్రపై పార్టీ శ్రేణుల్లో మరింత ఆదరణ పెరిగింది.
నాడు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ రాజశేఖరరెడ్డి అస్వస్థతకు గురైంది తూర్పుగోదావరి జిల్లాలోనే. పదిరోజులకు పైగా ఆయన రాజమండ్రిలోని ఓ తోటలో విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత యాత్ర కొనసాగించారు. ఇక అప్పటినుంచి ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా సింపతీ వెల్లువెత్తింది. ఇక ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
ఇపుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా సెంటిమెంట్ గా తూర్పులో ఓదార్పుయాత్ర కలిసొచ్చింది. ఓదార్పు యాత్ర అధిష్టానానికి వ్యతిరేకమని కొందరు, దీనిపై జగన్ కు షోకాజ్ నోటీసులిచ్చారని ఇంకొందరు ప్రచారం చేస్తూ జగన్ పార్టీని వదిలేస్తారని నానా కంగాళీ సృష్టించారు. ఈ గందరగోళం మధ్య ఆయన యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది. మొదటి అంకంలో కొందరు ఎమ్మెల్యేలు కూడా యాత్రకు మొహం చాటేశారు. యాత్రలో పాల్గొన్న ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ని అధిష్టానం చివాట్లు పెట్టిందని కూడా ప్రచారం లేవదీశారు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్ధంకాని వాతావరణాన్ని సృష్టించి పారేశారు. అయితే తూర్పున నాలుగోరోజు యాత్ర నాటికల్లా ఈ అనుమాన మేఘాలు వీడిపోయాయి. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ప్రకటనతో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గంలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. వైయస్ జగన్ పై ఏ విధమైన చర్యలుండవని మొయిలీ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. జగన్ పై పార్టీ అధిష్టానం కొరడా ఝళిపిస్తుందనే ఊహాగానాలకు మొయిలీ ప్రకటనతో తెరపడింది. జగన్ ఓదార్పు యాత్ర శుక్రవారం రాత్రి రాజమండ్రి చేరేటప్పటికే ఈ ప్రకటన రావడం, ఎమెల్యేలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొనడం జరిగిఫోయాయి. మొయిలీ ప్రకటనతో పలువురు ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం జగన్ ను కలుసుకున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో కేంద్రమంత్రి పళ్ళంరాజు, ఎంపీ ఉండవల్లి, రాష్ట్రమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొనడంతో యాత్రపై పార్టీ శ్రేణుల్లో మరింత ఆదరణ పెరిగింది.యువనేత జగన్ కు రాజమండ్రి ఆత్మీయ స్వాగతం
యువనేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు రాజమండ్రి నగరం లో అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆయనతో కరచాలనం చేసేందుకు యువకులు పోటీలు పడ్డారు. తనపట్ల వెల్లువలా చూపుతున్న ప్రజాభిమానానికి యువనేత చలించిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తాడితోట ఏరియాలో వేలాదిమంది ఆయనకు స్వాగతం పల్కారు. అక్కడ వైఎస్సార్ బస్ షెల్టర్ ను ఆయన ప్రారంభించారు. క్వారీ మార్కెట్ వద్ద వైఎస్ విగ్రహావిష్కరణకు వచ్చిన జగన్ కు అభిమానులు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వైఎస్ మరణంతో కలత చెంది మృతుడైన నరసింహమూర్తి కుటుంబానికి ఓదార్పునిచ్చే నిమిత్తం అన్నపూర్ణమ్మపేట జంక్షన్ కు చేరుకున్న జగన్ కు మహిళలు బొట్టు పెట్టి పూలు జల్లుతూ హారతులిచ్చి ఆప్యాయంగా స్వాగతించారు. నరసింహమూర్తి కుటుంబాన్ని జగన్ ఓదార్చారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఓదార్పు యాత్రకు తూర్పుగోదావరి జిల్లాలో అపరిమితమైన జనాదరణతో పాటు ఎమ్మెల్యేల మద్దతు కూడా పెద్దయెత్తున లభించింది. మొదట ఆరుగురు ఎమ్మెల్యేలు ఓదార్పు యాత్ర లో పాల్గొన్నారు.ఆ తరువాత మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసుతో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇంత ఆదరణ చూస్తే ఆశ్చర్యమేస్తోంది
కడప ఎం.పీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని మంత్రి పిల్లి.సుభాష్ చంద్రబోసు అన్నారు.ఆయన ఓదార్పు యాత్ర లో మీడియా తో మాట్లాడుతూ జగన్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ కి లాభమే కాని నష్టమేమి లేదన్నారు.నిజం చెప్పాలంటే పార్టీ కి అదనంగా పది ఓట్లు వస్తాయే కాని ఓట్లు పోవన్నారు.మంత్రి సుభాష్ చంద్రబోసు మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటినుండి దివంగత నేత వై.ఎస్.ఆర్ విదేయుడనని చెప్పారు. ఆయన మరణ వార్త విని మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న జగన్ ఓదార్పు యాత్ర లో పాల్గొనటం తన కనీస ధర్మమని అన్నారు. ఓదార్పు యాత్రకు తెల్లవారుజామున రెండు గంటలకు కూడా జనం నుంచి లభిస్తున్న విశేష స్పందన, ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యమేస్తున్నదని ఆయన అన్నారు
Saturday, July 10, 2010
జనం గుండె చప్పుడు జగన్ కావాలి సిఎం.... ఇదే కాంగ్రెస్ శ్రేణుల ఆశయం
(వైఎస్సార్ మరణం తర్వాత జనహృదయస్పందన మేరకు రాసిన కధనం)
జనం మెచ్చిన యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించాలంటూ కాంగ్రెస్ శ్రేణులన్నీ గళమెత్తి నినదిస్తున్నాయి. గురువారం రాత్రి జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటూ అధిష్టానాన్ని కోరింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేయాలని పలువురు మంత్రులు ప్రతిపాదించగా అతికొద్దిమంది మాత్రం ఇది సరైన సమయం కాదని వారించారు. అయితే వైఎస్ విధేయులైన కొందరు మంత్రుల సారధ్యంలో పలువురు తమ మనోభావాన్ని ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ వీరప్పమొయిలీ కి వివరించారు. తమ ఆకాంక్షను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని వారంతా ముక్తకంఠంతో విన్నవించారు. ప్రజల కోసం, పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన రాజశేఖరరెడ్డి గత రెండు ఎన్నికల్లోనూ పార్టీని విజయపధంలో నడిపించారని వైఎస్ ను అభిమానించే మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. జగన్ ను సిఎం చేయడం ద్వారా వైఎస్ త్యాగానికి, సేవలకు పార్టీ తగిన గుర్తింపు ఇచ్చినట్లు కాగలదని వారంటున్నారు. అంతే కాకుండా వైఎస్ ఆశయాలను సాకారం చేసే క్రమంలో కూడా జగన్ ఎంపిక కీలకం కాగలదని, దీర్ఘకలికంగా ఇది పార్టీకి మేలు చేస్తుందని భావిస్తున్నారు.
రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఏకగ్రీవంగా కోరుతున్నారు. మరో పక్క పార్టీ ఎమ్మెల్యేలందరూ జగన్ కు మద్దతుగా సంతకాల ఉద్యమం చేపట్టారు. కొన్ని గంటల్లోనే దాదాపు 125 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతకాలు చేశారని విశ్వసనీయ సమాచారం. ప్రజాప్రతినిధుల మద్దతు విషయం ఇలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, పార్టీ అభిమానులంతా ఒకే గొంతుతో జగన్ ను సిఎం చెయ్యాలని నినదిస్తున్నారు. కార్యకర్తల నుంచి కూడా జగన్ కు మద్దతుగా సంతకాల సేకరణ చేపడితే కోట్లాదిమంది సంతకాలు చేస్తారని పలువురు విశ్వసిస్తున్నారు. ఈ పరిణామాలను, వీటిలో ఇమిడి ఉన్న ప్రజల సెంటిమెంటును గమనించిన కాంగ్రెస్ అధిష్టానం కూడా సిఎం పదవికి జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని సీరియస్ గా పరిశీలిస్తోంది. పార్టీ ముఖ్యనేతల అభిప్రాయం ప్రకారం నూటికి 98శాతం మంది కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వమే శరణ్యమని వారంతా నమ్ముతున్నారు.
అయితే కొంతకాలంగా రాజశేఖరరెడ్డి పట్ల వ్యతిరేకంగా ఉన్న జెసి దివాకరరెడ్డి, శశిధరరెడ్డి, జానారెడ్డి లతో పాటు పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా జగన్ సిఎం కాకుండా అడ్డు పడాలని భావిస్తున్నారు.. పార్టీలో సీనియర్ నేతలకే సిఎం పదవి కట్టబెట్టాలని అంతర్గతంగా వీరు కోరుతున్నారని సమాచారం. అయితే వైఎస్ అనుకూల వర్గం వీరి ఆంతర్యాన్ని ముందే పసిగట్టింది. అందుకే ప్రజాస్వామ్య బద్ధంగా అందరి మద్దతునూ కూడగట్టడం ద్వారా తమ డిమాండ్ ను చట్టబద్ధంగా వర్కింగ్ కమిటీ ముందు ఉంచాలన్న వ్యూహంతో వారు ముందుకు సాగుతున్నారు. వీరి ప్రయత్నాలకు వర్కింగ్ కమిటీ లోని కొందరు సభ్యుల సహకారం కూడా ఉండటంతో జగన్ ను వ్యతిరేకించే వారి వాదన వీగిపొయే అవకాశాలు బలపడు తున్నాయి. పైగా కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఆశీస్సులందుకున్నవారిదే నాయకత్వం తప్ప అందరికీ ఆమోదయోగ్యులు ఉండరన్న అపప్రధ కూడా జగన్ విషయంలో ఉండదని, ఆయనను పార్టీ సమస్తం కోరుకుంటోందని పలువురు పేర్కొంటున్నారు.
ఆజన్మాంతం ప్రజా సంక్షేమానికి, తుదిశ్వాస వరకూ కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేసిన దివంగత రాజశేఖర రెడ్డి రాజకీయ వారసునిగా జగన్ ఇప్పటికే జనామోదం పొందారు. మూడున్నర మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో కడప ఎంపి గా ఆయన అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. చారిటబుల్ ట్రస్ట్, యువసేన వంటి వేదికల ద్వారా జగన్ రాష్ట్రవ్యాప్తంగా యువశక్తిని అకర్షించి సేవారంగం వైపు మళ్ళిస్తున్నారు. లక్షలాదిమంది యువకులు జగన్ పేరిట నడుస్తున్న సంస్థలలో చేరి తమ రాజకీయచైతన్యాన్ని, సేవానిరతిని చాటుతు న్నారు. తన విలక్షణవ్యక్తిత్వం, విశిష్టదృక్పధం ద్వారా జగన్ సిఎం కుమారునిగానే కాకుండా, సొంతంగా కూడా తనకంటూ ఇమేజ్ ని సృష్టించుకున్నారు. ముఖ్యంగా యువతకు ఆయన స్ఫూర్తిదాయక నేతగా, ఆరాధ్యనాయకునిగా నిలిచారు. గత ఎన్నికల్లో గొప్ప జనాదరణ కలిగిన సినిమా హీరోల సభలతో పోటీ పడి జగన్ సభలు విజయవంతం అయ్యాయి. గట్టి పోటీని, సొంత పార్టీలో అసమ్మతులను తట్టుకుంటూ పార్టీని ఒంటిచేత్తో గెలిపించేందుకు ప్రయాస పడిన తండ్రికి బాసటగా నిలిచిన జగన్ "పులిబిడ్డ" అనిపించుకున్నారు. రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించే జగన్ చేతల మనిషిగా పేరొందారు. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలను మోస్తూ పదుగురికీ ఆదర్శంగా నిల్చారు. సక్సెస్ ఫుల్ పారిశ్రామికవేత్తగా, సంచలనాల పత్రికా సారధిగా ఆయన విజయాలు అనన్యం. కడప ఎంపిగా ఎన్నికైన వెంటనే సామాన్యుల పక్షాన నిత్యావసరాల ధరలపై పోరాడిన జగన్ ఉదాత్త శైలి ఆయనను ప్రజల మనిషిని చేసింది. కార్యకర్తలు, నాయకుల ఆకాంక్షలు సిద్ధించి జగన్ ముఖ్యమంత్రి అయితే తండ్రి బాటలో నడిచి ఆర్తులకు ఆపన్నహస్తం అందిస్తాడన్న విశ్వాసం సర్వత్రా వ్యక్తమౌతోంది. ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ ప్రధానిగా, లోకప్రియనేతగా మన్నన లందుకోవడం జరిగినట్లే జగన్ కూడా రాజశేఖరుని వారసత్వం నిలబెట్టి భేష్ అనిపించుకుంటాడని మెజారిటీ కాంగ్రెస్ నాయకులు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు.

ఓదార్పు యాత్రకు ఎమ్మెల్యేలు సై

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఓదార్పు యాత్రలో పాల్గొనలా వద్దా అనే అంశంపై శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఇందులో మెజారిటీ ఎమ్మెల్యేలు యాత్రలో పాల్గొనాలనే తీర్మానించడంతో అందరూ ఇందుకు సిద్ధపడినట్టు భోగట్టా. జగన్ వర్గానికి చెందిన వారే కాకుండా.. ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇపుడు శ్రీకాకుళంలో జగన్ కు లభిస్తున జనాదరణ చూసి మేల్కొంటున్నారు. కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పుకు వారు కూడా సై అంటున్నారు. యాత్రలో పాల్గొనక పోతే తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థంగా మారుతుందని గ్రహించారు. ఫలితంగా.. ఓదార్పులో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నారు. శని, ఆదివారాలు అసెంబ్లీకి కూడా సెలవు కావడంతో ఓదార్పు యాత్రలో పాల్గొనేందుకు పలువురు ఎమ్మెల్యేలు శ్రీకాకుళంకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రోశయ్యతో శుక్రవారం కూడా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓదార్పు యాత్రలో పాల్గొనే అంశమై మంతనాలు జరిపారు. అధిష్టానం ఆదేశాలను ఎవరూ ధిక్కరించవద్దని రోశయ్య మళ్ళీ చెప్పగా పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకించారని తెలిసింది. మంత్రులైతే ప్రభుత్వంలో భాగమని, తమకా ఇబ్బంది లేదని కొందరు ఎమ్మెల్యెలు నేరుగా రోశయ్యకే చెప్పారు. మంత్రులకైతే పదవులు పోతాయని భయం ఉంటుంది.. తమకేమని వారు ప్రశ్నించినట్టు సమాచారం. యాత్రలో తాము పాల్గొనకపోతే నియోజకవర్గాల్లో ఇబ్బందులు తప్పవని తాము వెళితే పలకరించే నాధుడే ఉండరని వారు వాపోయారు. యాత్రలో పాల్గొనాలనే తాము నిర్ణయించుకున్నట్టు సీఎంకు తేల్చి చెప్పారు. ఇపుడు శ్రీకాకుళంతో పాటు.. తూర్పుగోదావరి జిల్లాలో 11వ తేదీనుంచి జరిగే ఓదార్పు యాత్రలో పాల్గొనేందుకు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సిద్ధమవుతున్నారు.
పదవినైనా వదిలేస్తా...ఓదార్పులో పాల్గొంటా!! స్పష్టం చేసిన మంత్రి బోస్

ఓదార్పు యాత్రలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొంటానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఇందుకు అడ్డొస్తే తన మంత్రిపదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. ఈనెల 11వ తేదీ నుంచి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్.జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభంకానుంది. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనకుండా మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు కొంతమంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బోస్ ఆరోపించారు. తన సొంత జిల్లాలో జరిగే యాత్రలో పాల్గొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. "నేను జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటాను. అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకైనా సిద్ధమే"
అని ఆయన ప్రకటించడం గమనార్హం.
మంత్రులు అక్కడ... కుటుంబాలు ఇక్కడ!! జగన్ యాత్రకు నేతల పరోక్ష మద్దతు

జగన్ ఓదార్పు యాత్రలో ఎంత పాల్గొనాలని ఉన్నా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు వీలు కావడంలేదు. అధిష్టానం ఏమంటుందోననే భయం, సీఎం వద్ద తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయన్న ఆందోళన, అసెంబ్లీ తాలూకు బిజీ షెడ్యూల్ కారణంగా వారు దూరంగా ఉండిపోయారు. అయితే వారిలో చాలామందికి మనసంతా యాత్రపైనే ఉంది. దీంతో వారందరూ తమ అనుచరుల్ని, ద్వితీయ శ్రేణి పార్టీ నేతల్ని, కుటుంబ సభ్యులని జగన్ యాత్రకు పంపుతున్నారు. ఇందుకు ఉదాహరణగా రెండో రోజు ఓదార్పు యాత్రలో జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుటుంబసభ్యుల హడావుడిని పేర్కొనవచ్చు. ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామమనోహర్‌నాయుడు హైదరాబాద్ నుంచి హుటాహుటిన టెక్కలి చేరుకొని ఈ యాత్ర పొడవునా జగన్‌కు తోడుగా ఉన్నారు. నరసన్నపేట పట్టణంలో వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్‌ను ఆహ్వానిస్తున్నట్టుగా ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు నరసన్నపేట ఎంఎల్ఏ ధర్మాన కృష్ణదాస్‌ల ఫోటోలతో ప్లెక్సీ బ్యానర్లు కట్టారు. ఈ కార్యక్రమం ఎలా జరుగుతోందంటూ ఎంఎల్ఏ కష్ణదాస్ నరసన్నపేటలో నాయకులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఓదార్పు యాత్రలో జగన్‌తోపాటు ఎంఎల్ఏ కృష్ణదాస్ సతీమణి పద్మప్రియ, కుమారుడు రామలింగంనాయుడు వారి అనుచరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
కంటి మీద కునుకు లేకుండా యాత్రను కొనసాగిస్తూ తీవ్రంగా అలిసిపోతున్న పరిస్థితిలో కూడా జగన్ ఈ వాస్తవాన్ని విస్మరించడంలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ద్వితీయ శ్రేణి నాయకులు, వారి వెనుక ఉన్న ముఖ్య నేతలు, వారి వారి అనుచరుల ప్రోత్సాహంతోనే తన యాత్ర ఇంతగా విజయవంతమవుతోందన్న విషయాన్ని జగన్ మననంలో ఉంచుకున్నారు. జిల్లాలో లేకపోయినప్పటికీ ఆయా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల గృహాలకు వెళుతూ జగన్ వారి ప్రాధాన్యతను గౌరవిస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)

.jpg)

1.jpg)

.jpg)