Wednesday, August 18, 2010

యాత్రకి సిద్ధమన్న బాలినేని, సబ్బం


ప్రకాశం జిల్లాలో వచ్చే నెల మూడో తేదీ నుంచి కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న ఓదార్పు యాత్రలో తాము పాల్గొని తీరుతామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తనతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఈ యాత్రలో పాల్గొంటారని ఆయన తేల్చి చెప్పారు. ఓదార్పు యాత్రలో పార్టీ శ్రేణులను పాల్గొనవద్దంటూ అధిష్టానం ఆదేశించిందని మీడియాలో వార్తలు గుప్పుమన్న తర్వాతే  మంత్రి బాలినేని ఈ ప్రకటన చేయడం విశేషం. అలాగే విశాఖ ఎంపీ సబ్బం హరి కూడా ఓదార్పు యాత్రలో పాల్గొంటానని తేల్చి చెప్పారు. ఓదార్పుయాత్రలో పాల్గొనవద్దని అధిష్టానం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వారన్నారు.  యాత్రలో ప్పాల్గొనరాదనేది అధిష్టానం అభిమతమైతే ఆమేరకు వ్యక్తిగతంగా తనకీ అధిష్టానం సమాచారమివ్వాలని సబ్బం హరి అన్నారు. ఇదిలావుండగా, వైఎస్‌.జగన్‌ చేపడుతున్న ఓదార్పు యాత్రలో ప్రజాప్రతినిధులెవ్వరూ పాల్గొన వద్దని, అది ఆయన వ్యక్తిగతమని కాంగ్రెస్‌ హైకమాండ్‌ పార్టీ శ్రేణులకు సూచించింది. జగన్‌ తీరుపై సోనియా ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీలోని ఓ వర్గం విస్తారంగా ప్రచారం చేస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం జగన్ శిబిరంలో ఒకింత నైరాశ్యాన్ని నింపింది. 

No comments: