వైయస్ జగన్ ను కాంగ్రెస్ అధిష్టానం బ్లాక్ మెయిల్ చేస్తోందా.... అవుననే అనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోని నిర్ణయాలను కాంగ్రెసు అధిష్టానం తిరగదోడుతోంది. వివాదాస్పద నిర్ణయాలను, తన వారికి కోట్లాది రూపాయల ఆదాయాలు సమకూర్చే వనరులను కట్టబెట్టారనే ఆరోపణలున్న అంశాలను తిరగదోడుతూ ప్రభుత్వపరంగా జగన్ కు ఆయన కుటుంబ సభ్యులకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా గనుల లీజు వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. గనుల లీజు వ్యవహారాలు జగన్ వర్గానికి సంపదను సమకూర్చిపెడుతున్నట్లు కొందరు సీనియర్లు అధిష్టానాన్ని నమ్మించారు. దీంతో ఈ దిశగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. తన బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి గనుల శాఖ మంత్రిగా నియమించడం గనులను కొల్లగొట్టే వ్యూహంలో భాగమేనని దుష్ప్రచారం కొందరు చేపట్టారు. వైయస్ నిర్ణయాలను తిరగదోడడం ద్వారా జగన్ ఆర్థిక బలాన్ని నిర్వీర్యం చేయడం, నైతికంగా దెబ్బ తీయడం కాంగ్రెసు అధిష్టానం దూ(దు)రాలోచనగా తెలుస్తోంది. రోశయ్య ముఖ్యమంత్రి కాగానే దీనికి నాంది పలికారు. కర్నాటక మంత్రి, వైయస్ సన్నిహితుడు అయిన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల వ్యవహారంపై కూడా అధిష్ఠానం కన్నేసింది. జనార్దనరెడ్డి గనుల తవ్వకాల్లో వైఎస్ వర్గానికి వాటాలున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దాంతో ఓబుళాపురానికి కాంగ్రెస్ అధిష్టానం ఆసరాతో ప్రభుత్వం చెక్ పెట్టింది. చీమకుర్తి గ్రానైట్ వ్యవహారంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోందని సమాచారం. మరోపక్క ఏకపక్షంగా కొందరు అధికారుల్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టింది,
తాము వద్దన్నా ఓదార్పు యాత్ర చేస్తున్న తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు షాక్ ఇవ్వాలనే కాంగ్రెసు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన బయ్యారం గనుల లీజును ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో ఇనుప ఖనిజం లీజును నిలుపుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రోశయ్య స్వయంగా ఈ గనుల ఫైళ్ళను పరిశీలిస్తూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టారు ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో కూడా బయ్యారం గనుల అక్రమాలపై విచారణ జరిపిద్దామని ముఖ్యమంత్రి మంత్రులందరూ కాదంటున్నా సరే గట్టిగా ప్రతిపాదించడం ఆయన ధోరణికి నిదర్శనం. అయితే వైఎస్ హయాంలో జరిగిన ప్రతీ కార్యకలాపానికీ ఈ మంత్రులతో పాటు రోశయ్య కూడా బాధ్యుడే అనేది నైతికమైన విషయం. వైఎస్ సంక్షేమ కార్యక్రమాలలో తమకూ, తమ పార్టీకి, తమ మంత్రివర్గానికీ పాత్రను వెదుక్కునే ప్రబుద్ధులు తమకేమీ తెలియనట్టు, నాటి పరిణామాల్లో అవినీతి జరిగిందంటూ ఇపుడు చర్యలకు దిగడం వారి లేకి బుద్ధికి దురుద్దేశాలకూ ప్రత్యక్ష నిదర్శనం. నిజంగా వైఎస్ హయాంలో ఏదైనా అక్రమాలు జరిగిఉంటే రోశయ్య నుంచి సోనియా వరకూ అందరూ అందులో భాగస్తులే కావాలి..... అయితే వైఎస్ ఎంతో తపనతో అమలుపర్చిన సంక్షేమ పధకాలకు మాత్రం ఆయన ఒక్కడే కర్త, కర్మ, క్రియ అనేది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే ఇవాల్టి ప్రభుత్వం వైఎస్ పధకాల్ని భారంగానే భావిస్తోంది, వదిలించుకోవాలని ప్రయత్నిస్తోంది గనుక. 1.jpg)
No comments:
Post a Comment