Wednesday, August 18, 2010

ముఖ్య అనుచరులతో జగన్ కీలక భేటీ

కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ శ్రావణ మాసంలో తొలి శుక్రవారం నాడు తన నివాసంలో ఓ కీలక భేటీ జరిపారు. తన ముఖ్య అనుచరులతో ఆయన తన భవిష్యత్తు వ్యూహంపై ఇవాళ చర్చించారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే శుక్రవారం తన అనుచరులతో కూర్చున్న జగన్ భవిష్యత్తు పై స్పష్టమైన విజన్ తో చర్చలు జరిపారంటున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన వైయస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా జరిపే సంస్మరణ సభ తాలూకు పోస్టర్ ను ఆయన ఈ సందర్భంగా విడుదల చేశారు. పార్టీతో  ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయన దాన్ని సొంత కార్యక్రమంగానే తీసుకుంటున్నారు. ఈ సంస్మరణ సభలోనే ఆయన సొంత పార్టీ పెడతారని జోరుగా
ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. కాగా శుక్రవారం జగన్ ను కలిసినవారిలో ఎపిఐఐసి మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, శాసనసభ్యురాలు కొండా సురేఖ, టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు. వచ్చే నెల 3వ తేదీన జగన్ ఓదార్పు యాత్ర ప్రకాశం  జిల్లాలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత నెల్లూరు  జిల్లాలో యాత్ర జరుగుతుందని భావిస్తున్నారు.

No comments: